‘కూతురి’తో డేరా బాబా రాసలీల ?? - MicTv.in - Telugu News
mictv telugu

‘కూతురి’తో డేరా బాబా రాసలీల ??

August 26, 2017

డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్..  పరదా చాటు అవతారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజా అవతారం గురించి తెలిస్తే అతణ్ని పశువు కాదు కదా పశువు కన్నా హీనమైన వాడనుకుంటారు ఎవరైనా. పంచకులలో తన కూతురుగా చెప్పుకున్న హనీప్రీత్ అలియాస్ ప్రియాంకతో అక్రమ సంబంధం నెరిపారట అయ్యగారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన అల్లుడు విశ్వాస్ గుప్తానే ఒక ప్రైవేట్ చానల్ తో చెప్పాడు. ఉచ్ఛనీచాలు మరిచి మరీ ఇంత దారుణానికి ఒడిగడతాడా ? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వాస్ గుప్త ఆరోపణ ప్రకారం ప్రియాంక..  రామ్ రహీమ్ సింగ్కు భార్య అట.  ఆమెను తన దత్తత కూతురని డేరాలో పరిచయం చేసి ఆమె పేరును హనీప్రీత్ సింగ్ గా మార్చేశాడట. ఈ ప్రపంచాన్ని ఆమెను తన కూతురిగా నమ్మిచాడు.

విశ్వాస్ గుప్తాతో 28 ఫిబ్రవరి 1999 లో పెళ్ళి కూడా చేసాడట. 2011లో ఒకరోజు తెరిచున్న డేరాబాబా గదిలోకెళ్ళిన విశ్వాస్ గుప్త అక్కడ తన కళ్ళతో చూడరాని దృశ్యాన్ని చూసి షాకయ్యాడట. ఆ గదిలో తన భార్య, డేరా బాబాలు అత్యంత సన్నిహితంగా కనిపించారట. వెంటనే తేరుకున్న డేరాబాబా విశ్వాస్ గుప్తాను ( అల్లుణ్ణి ) బెదిరించాడట. ఈ విషయం బయటకు పొక్కితే నిన్నూ, నీ ఫ్యామిలీని మొత్తం చంపేస్తానని బెదిరించేసరికి విశ్వాస్ ప్రాణభయంతో వణికిపోయాడు. తన అమ్మానాన్నలతో కలిసి హర్యాణాకు మాకాం మార్చాడట. ఇప్పుడు సమయం వచ్చింది గనక ఈ దారుణాన్ని దాచి ప్రయోజనం లేదు. ఆ దుర్మార్గుడి దురాగతాన్ని ఈ ప్రపంచానికి తెలియజెప్పాలనే వుద్దేశంతో చెప్తున్నానన్నాడు విశ్వాస్ గుప్తా.

ఆగస్టు 28 కు కోర్టు తీర్పు వెలవడనున్న సందర్భంగా డేరా బాబా భాగోతాలు ఒక్కక్కటిగా బయటకు పొక్కుతున్నాయి. అంటే ఈ లెక్కన విశ్వాస్ లాంటి బాధితులు ఇంకా చాలా మందే ఉన్నారట. అతని ధమ్కీలకు భయపడినవారు ? వారంతా ఇప్పుడు విశ్వాస్ లా ధైర్యంగా ముందుకొస్తుంటే బాబాగారి లీలలు బయటకొస్తున్నాయి. దీన్నిబట్టి ఇంకా ఎంత మంది బాధితులు అండర్ గ్రౌండ్ లో వున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.