ఆస్ట్రేలియాలో  దేశపతి శ్రీనివాస్ ఘెరావ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్ట్రేలియాలో  దేశపతి శ్రీనివాస్ ఘెరావ్

November 27, 2017

సిడ్నీలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహాక సభలో  టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దేశపతి శ్రీనివాస్‌ను ఘెరావ్ చేశారు.

ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణ ఆదిలోనే హంసపాదుకా అన్నట్లు  ఎటువంటి భాషా పరిజ్ఞానం , సాహిత్య పరిచయం లేని  వ్యాపార వేత్తను ఎన్నారై కోఆర్డినేటర్‌గా నియమించి తెలుగు మహా సభల స్థాయిని తగ్గించారని ఆరోపిస్తూ ఘెరావ్ చేశారు.

అమెరికాలో నివాసం ఉంటున్న మహేష్ బిగాలను ఏ ప్రాతిపదికన  తెలుగు సభల కోఆర్డినేటర్‌గా నియమించారని ఎటువంటి భాషా పరిజ్ఞానం ,సాహిత్యం తెలియని వారిని నియమించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని వెంటనే మహేష్‌ను తొలగించి ఆ స్థానంలో సాహిత్య వేత్తలకు ఛాన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. దేశపతి శ్రీనివాస్ దాన్ని ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు .

మహేష్ బిగాల నియామకంపై  ఇంగ్లాండ్, అమెరికా ఆస్ట్రేలియా వంటి అన్నీ దేశాల్లో  వ్యతిరేకించారని, ఎందుకు తెలుగు సభల గౌరవాన్ని తగ్గిస్తారని నిలదీశారు . మహేష్ బిగాల నియామకం చట్టరిత్యా కూడా చెల్లదని దానికి ప్రాతిపదికనే సరిగ్గా లేదని ఆయనను విధుల నుండి తప్పించాలని  రాజశేఖర్ రెడ్డి  మన్యం డిమాండ్ చేశారు.