భారత తొలి మహిళా డిటెక్టివ్ అరెస్ట్ ! - MicTv.in - Telugu News
mictv telugu

భారత తొలి మహిళా డిటెక్టివ్ అరెస్ట్ !

February 3, 2018

ఏదైనా కేసు సరైన ఆధారాలు దొరకక మిస్టరీగా ఉంటే, గుట్టుమట్లను సేకరించడానికి  కేసును ప్రైవేట్ డిటెక్టివ్‌లకు అప్పగిస్తారు. డిటెక్టివ్  జాబ్ రిస్క్ ‌తో కూడుకున్నది కాబట్టి ఇందులో ఎక్కువ శాతం డిటెక్టివ్‌లుగా  మగవారే ఉంటారు. మనదేశంలో మహిళా డిటెక్టివులను వేళ్లపై లెక్కొపెట్టొచ్చు.

విషయం ఏమంటే.. మనదేశంలో మొదటి సారి  డిటెక్టివ్ అయిన మహిళ రజనీ పండిట్ (54)  ఇతరులకు సంబంధించిన కాల్ డేటాను అక్రమంగా సేకరించింది. దీంతో ఆమెను ముంబై పోలీసులు  అరెస్ట్  చేశారు.కాల్ రికార్టింగ్స్ టెలికాం కంపెనీల నుంచి  కాల్ డిటేయిల్ రికార్డ్స్(సీడీఆర్)లను రజనీ  డిటెక్టివ్ గ్యాంగ్ లతో కుమ్మక్కై  వారికి డబ్బులు ఆశ చూపి  సేకరించింది. రజనీ  భారీ మొత్తంలో డబ్బులు ఇస్తానంది అందుకే డేటాను  దొంగలించామని  అరెస్టైన డిటెక్టివ్ గ్యాంగ్‌లోనివ్యక్తులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దీనితో  థానే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సీడీఆర్ స్కాంలో  ప్రమేయం ఉన్న వారందరిని అరెస్ట్ చేస్తామని  పోలీసులు స్పష్టం చేశారు. స్కాంలో అరెస్ట్ అయిన డిటెక్టివ్  రజనీ తండ్రి పోలీసు డిపార్ట్‌మెంట్‌‌లో పని చేసి రిటైరయ్యారు.