ఆడవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా - MicTv.in - Telugu News
mictv telugu

ఆడవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా

November 23, 2017

‘దేవీశ్రీప్రసాద్’ అంటే సంగీత దర్శకుడి పేరు అని అనుకుంటున్నారా? కాదు ఆపేరు పెట్టడానికి  వెనకున్న మర్మమేంటో తెలియాలంటే నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను చూడాల్సిందే. దేవీశ్రీప్రసాద్ అనేది పేరు కాదు సమాజంలో ఉండే మంచి,చెడు, నీచాలు మనుషుల్లో  ఎంత లోతుకు పాతుకు పోయాయో కళ్లకు కట్టినట్టు చూపించే సామాజిక అంశాలతో కూడుకున్న సినిమా. ఈ సినిమా చిన్న సినిమాగా మొదలయ్యి  ప్రేక్షకుల్లో చాలా పెద్ద అంచనాలను నెలకొల్పింది. ఇప్పటికే  విడుదలైన టీజర్, ట్రైలర్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ధనరాజ్, భూపాల్ రాజు, మనోజ్ నందన్, పూజా రామచంద్రన్ ముఖ్యపాత్రలుగా  శ్రీ కిషోర్ దర్శకత్వంలో  తెరకెక్కింది.ఈసినిమాను ఎందుకు చూడాలి

’సమాజంలో కొందరు మృగాళ్ల అకృత్యాలకు బలి అవుతున్న ఆడవాళ్లు తమ శక్తి యుక్తులతో అటువంటి వారిని ఎలా ఎదుర్కోవచ్చో ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. ఆడవాళ్లు మరీ మరీ చూడాల్సిన సినిమా ఇది, సమాజంలో పేరుకు పోయిన అరచాకాలను అరికట్టేందుకు గల అస్త్రాలు మనందరిలోనూ ఉన్నాయని గుర్తుచేసే సినిమా ఇది’ అని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈసినిమా డైరెక్టర్ శ్రీ కిషోర్ గురించిముఖ్యంగా చెప్పుకోవాల్సిందే ఈ సినిమా డైరెక్టర్ గురించి. ఎక్కడి నల్గొండ, ఎక్కడి హాంకాంగ్, ఎక్కడి హైద్రాబాద్. సినిమా అంటే పాషన్, నల్గొండలో పుట్టిన శ్రీ కిషోర్ సినిమాపై అమితమైన ప్రేమను పెంచుకున్నాడు. రెండు సంవత్సారాలు అసిస్టెంట్ ఎడిటర్ గా, డైరెక్టర్ గా చేసాడు. కానీ ఆతర్వాత పరిస్థితులు హాంకాంగ్ వెళ్లి ఉద్యోగం చెయ్యమన్నాయి. ఉద్యోగంలో ఉన్నా కూడా ధ్యాసంతా సినిమాలపైనే. సినిమాపై ఉన్న ప్రేమతో కసిగా ‘స‌శేషం`,`భూ`  అనే  సినిమాలను తీసాడు. ఆ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇప్పుడు  సమాజాన్ని చైతన్య పరిచేందుకు  హాంకాంగ్ లో కొన్ని రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి  హైద్రాబాద్ వచ్చి కేవలం 28 రోజుల్లో  ఈ దేవీశ్రీప్రసాద్ అనే సినిమాను తీసాడు.

మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే  నమ్మకంతో ఈ సినిమాను తీసామని డైరెక్టర్ శ్రీ కిషోర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టు ‘దేవీశ్రీప్రసాద్’ టీమ్