హాలీవుడ్‌లోకి ధనుష్ - MicTv.in - Telugu News
mictv telugu

హాలీవుడ్‌లోకి ధనుష్

November 2, 2017

మామలానే అల్లుడు కూడా సినిమా రంగంలో దూసుకుపోతున్నాడు. వయసు మీద పడుతున్నా వినూత్నమైన సినిమాలు చేస్తూ కొనసాగుతున్న రజినీకాంత్‌కు దీటుగా అల్లుడు ధనుష్ కూడా మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజిని సంపాధించుకున్నాడు.తాజాగా ధనుష్ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. ‘ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ఉమా తుర్మన్ ఈ సిన్మాలో ధనుష్ సరసన నటిస్తోంది. ధనుష్ ఈ సినిమాలో ఇండియాకు చెందిన ఒక కళాకారుడిగా ‘ అజా’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కెన్‌స్కాట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం విశేషం.ధనుష్ హాలీవుడ్ ఎంట్రీపై మామ రజినీ కాంత్ కూడా చాలా సంతోషంగా వున్నాడు. బాలీవుడ్‌లో రాంజ్‌నా, షమితాబ్ వంటి సినిమాలు చేసి అక్కడ కూడా మంచి మార్కులు కొట్టేసాడు. తాజాగా హాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నాడు ధనుష్. తప్పకుండా ఈ సినిమా కూడా తనకు మంచి పేరును తీసుకు వస్తుందంటున్నారు ధనుష్ అభిమానులు.