డిండి ఎత్తిపోతల పథకానికి ఆర్. విద్యాసాగర్ రావు పేరు - MicTv.in - Telugu News
mictv telugu

డిండి ఎత్తిపోతల పథకానికి ఆర్. విద్యాసాగర్ రావు పేరు

April 14, 2018

తెలంగాణ  ప్రభుత్వం సాగునీటి రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగర్ రావు పేరును డిండి ,ఎత్తిపోతల పథకానికి  పెట్టాలని నిర్ణియింది. ఫ్లోరైడ్ బాధిత ,కరువు పీడత ప్రాంతాలకు మంచినీరు ,సాగునీరు అందించడమే  ఈ పథకం ఉద్దేశ్యం. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఇక నుంచి ఈ ప్రాజెక్టును ‘‘ఆర్.విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకం’’ గా పరిగణించాలని నీటి పారుదల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ‘సాగునీటి రంగంలో తెలంగాణపై జరిగిన వివక్షను ఆర్.విద్యాసాగర్ రావు ఎలుగెత్తి చాటారు. సంక్షిష్టమైన విషయాలను చాలా సులువుగా అర్థమయ్యే విధంగా విడమరిచి చెప్పి, జరిగిన అన్యాయంపై ప్రజలను చైతన్య పరిచారు.విద్యాసాగర్ రావు అనారోగ్యంతో బాధపడుతూ తన చివరి కోరికగా తన సొంతూరు సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి లక్ష్మి నర్సింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరారు. దీనికోసం అప్పుడే దేవాలయ పునరుద్ధరణకు కోటి రూపాయలు మంజూరు చేశామని’ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.