దిల్‌రాజుకు సాయిపల్లవి షాక్   - MicTv.in - Telugu News
mictv telugu

దిల్‌రాజుకు సాయిపల్లవి షాక్  

December 5, 2017

హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి తన కెరియర్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. ఆ క్రమంలో కథలో తన పాత్రకు ప్రాధాన్యం లేదని ఏకంగా దిల్‌రాజు ఆఫర్‌నే కాదనుకున్నది.

దిల్‌రాజు నిర్మించిన ‘ ఫిదా ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సాయిపల్లవి, ఆ తరువాత అదే బ్యానర్‌లో వస్తున్న ‘ ఎమ్‌సీఏ ’ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా కొత్తగా అదే బ్యానర్‌లో  నితిన్ హీరోగా ‘ శ్రీనివాస కళ్యాణం ’ అనే సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి అయితేనే బాగుంటుందని దర్శకుడు వేగేశ్న సతీష్ పట్టుబట్టాడట. దర్శకుడు సాయి పల్లవికి కథ కూడా వినిపించాడట. కథ మొత్తం విన్నాక తన పాత్రకు అందులో ప్రాముఖ్యత లేకపోవడంతో పెదవి విరిచినట్టు సమాచారం.

నటనకు ఆస్కారం లేని ఈ పాత్రను నేను చేయనని ముఖం మీదే దిల్‌రాజు ఆఫర్‌ను వద్దన్నదట. సాయిపల్లవి నో చెప్పేసాక ఆమె స్థానంలోకి  పూజా హెగ్డేను తీసుకున్నారట. దీన్నిబట్టి సాయి పల్లవి తన సినీ భవిష్యత్తుకు ఇప్పుడు ఎంచుకునే పాత్రలే ప్రభావం చూపుతాయని భావిస్తున్నట్టున్నది.