కోహ్లీ కారణంగా నాఉద్యోగం పోయింది - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లీ కారణంగా నాఉద్యోగం పోయింది

October 31, 2017

విరాట్‌ కోహ్లీని జట్టులోకి ఎంపిక చేసినందుకు తనను ఉద్యోగంలో నుంచి తొలగించారని మాజీ క్రికెటర్‌,మాజీ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘డెమోక్రసీ ఎలెవన్‌’ పుస్తకావిష్కరణ  కార్యక్రమానికి హాజరైన ఆయన, తన ఉద్యోగం ఎలా పోయిందనే విషయాన్ని అందరితో పంచుకున్నాడు.

‘2008లో  కోహ్లీ సారథ్యంలోని అండర్‌-19 భారత జట్టు ప్రపంచకప్‌ గెలిచింది. ఆటోర్నీలో కోహ్లీ ప్రదర్శన చూసి భారత జట్టుకు ఎంపిక చేశాను. తమిళనాడు క్రికెటర్‌ బద్రీనాథ్‌ స్థానంలో విరాట్‌కు జట్టులో అవకాశం కల్పించాను. నేను చేసిన ఈ మార్పు బోర్డులో ఉన్న చాలా మందికి నచ్చలేదు. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు శరద్‌పవార్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. కోహ్లీ ఎంపికను ప్రకటించిన మర్నాడే నన్ను చీఫ్‌ సెలక్టర్‌ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు అందాయి. నా ఉద్యోగం అయితే పోయిందిగానీ నేను ఎంపిక చేసిన కోహ్లీని మాత్రం అలాగే కొనసాగించారు’ అని దిలీప్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.