నగదు రహిత దేశంగా మార్చడం కోసం ఏటిఎంల సంఖ్య తగ్గిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాదిలో జూన్ నుంచి ఆగస్టు మధ్య 358 ఏటీఎంలను తగ్గించారు. ఏటీఏం సంఖ్య తగ్గిపోవడం ఇదే తొలిసారి. గత నాలుగేళ్లలో ఏటీఎంల సంఖ్య 16. 4 శాతం పెరిగినప్పటికీ, వృద్ది మాత్రం 3.6 శాతానికి తగ్గింది. పెద్ద నోట్ల రద్దు తరువాత ఏటీఎంల సంఖ్యను బ్యాంకులు క్రమంగా తగ్గిస్తున్నాయి.
దేశంలోనే అతి పెద్ద బ్యాంకు ఎస్బీఐ, తన ఏటీఎంల సంఖ్యను తగ్గించింది. ఇటీవల ఎస్బీఐ బ్యాంకు ఆరు బ్యాంకులను వీలీనం చేసుకుంది. వాటికి సంబంధించిన ఏటీఎంలను కూడా మూసివేస్తోంది. ఈ ఏడాది జూన్ లో 59,291 ఏటీఏంలను కల్గి ఉన్న ఎస్బీఐ, ఆ సంఖ్క్ష్యను 59,200లకు తగ్గించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు 10,502 ఏటీఎంల నుంచి 10,083 తగ్గించింది. హెచ్డిఎఫ్సి కూడా తన ఏటీఎంల సంఖ్యను తగ్గించింది. మైట్రోల్లో, ఎయిర్ ఫోర్టుల్లో ,ఫ్రైమ్ లోకేషన్లో, అద్దె ధరలు పెరగడంమే దీనికి ఇంకో కారణం. మరోవైపు సెక్యూరిటీ స్టాఫ్,ఏటీఏం ఆపరేషర్లకు చెల్లించే వేతనాలు , కరెంట్ బిలు, ఇలా ప్రతి ఒక్కటి బ్యాంకులను భారంగా అవుతున్నాయి.
ఎటీఎంలు తగ్గడం వల్ల వినియోగదారులకు ఏటువంటిి సమస్యలు ఉండవని, అంతపెద్ద ప్రభావం కూడా ఉండదని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయాల్సిన అవసరం లేదు. చాలా దుకాణాల్లో టెల్లర్ మిషన్లు వచ్చేశాయి. దాంతో తమకు కావల్సిన వస్తువులు కొని అక్కడే డెబిట్ కార్డుల ద్వారా బిల్లు చెల్లింపులు చేసుకోవచ్చు అని బ్యాంకు అధికారులు అంటున్నారు. కానీ అన్ని చోట్ల టెల్లర్ మిషన్లు అందుబాటులో ఉండాలి కదా అనేది ప్రజల వాదన.
banks, atm, increasing, no cash, discreasing, sbi