ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన బిత్తిరి సత్తి - MicTv.in - Telugu News
mictv telugu

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన బిత్తిరి సత్తి

November 27, 2017

వీ6 ఛానల్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు బిత్తిరి సత్తి. ఎందరికో అభిమాన నవ్వుల రేరాజు సత్తి. అలాంటి సత్తి మీద మణికంఠ అనే యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. కారలోనుండి దిగుతున్న సందర్భంలో సత్తి మీద అకస్మాత్తుగా దాడి చేశాడు మణికంఠ. దాడిలో సత్తి ముఖానికి, చెవికి గాయాలయ్యాయి.

వెంటనే బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ‘ అంత ప్రమాదకర గాయాలేం కాలేదు. ప్రస్తుతం అతని ఆరోగ్యం సవ్యంగానే వున్నది. తగిన చికిత్స చేసి డిశ్చార్జ్ చేసినట్టు ’ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.