కుక్క, మేకకు నిన్న పెండ్లి.. నేడు విడాకులు ! - MicTv.in - Telugu News
mictv telugu

కుక్క, మేకకు నిన్న పెండ్లి.. నేడు విడాకులు !

February 15, 2018

ఈ సంవత్సరం ప్రేమికుల రోజు నాడు చాలానే విచిత్రాలు జరిగాయి. వాలెంటైన్స్ డేను వ్యతిరేకిస్తూ కొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలేమో  కనపడ్డ ప్రేమికులపై దాడులకు పాల్పడితే, మరి కొందరేమో మనది కాని సంస్కృతికి ఆర్భాటాలు అవసరం లేదు అని దాన్ని వ్యతిరేకిస్తూ జంతువులకు పెళ్లి చేశారు.చెన్నైలో భారత్ హిందూ ఫ్రంట్  కార్యకర్తలు  ప్రేమికుల దినోత్సవానికి నిరసనగా గాడిదకు, కుక్కకు పెళ్లి చేశారు. తమిళనాడులోని కోయం బత్తూరులో కూడా ఫిబ్రవరి14కు వ్యతిరేకిస్తూ  ఓ వర్గం వారు  కుక్కకు, మేకకు పెళ్లి చేశారు. అయితే ఇంకా విచిత్రంగా నిన్న జరిగిన కుక్క, మేక పెళ్లిని వ్యతిరేకిస్తూ  వాటికి విడాకులు కావాలని  ద్రవిడర్ కళగం కార్యకర్తలు కోయంబత్తూరులోని ఫ్యామిలీ కోర్టుకెళ్లారు, వెంటనే ఆ కుక్క, మేకను విడగొట్టి.. విడాకులు ఇవ్వండి మహాప్రభో.. అని వారు కోర్టువారికి విన్నవించుకున్నారు. ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ ఆ వర్గంవారు చేసిన జంతువుల పెళ్లిళ్లపై ఈ సందర్భంగా ద్రవిడర్ కార్యకర్తలు మండిపడ్డారు. వాళ్లు  ప్రేమికులను రోజును వ్యతిరేకించి.. జాతివిరుద్ధంగా  పెళ్లి చేస్తే.. మేము ప్రేమికుల రోజుకు మద్దతుగా  విడాకులు ఇప్పిస్తున్నామని వాళ్లు స్పష్టం చేశారు. కానీ నిజంగా ఆ జంతువులకే గనుక మాటలస్తే అసలు ప్రేమికుల రోజుకు మాకు సంబంధం ఏంటి? మీగొడవల్లోకి ప్రశాంతంగా బ్రతుకుతున్న మాజంతువులను ఎందుకు లాగుతున్నారు? అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటాయేమో.