విడాకులు తీసుకుంటున్న జూనియర్ ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

విడాకులు తీసుకుంటున్న జూనియర్ ట్రంప్

March 16, 2018

అమెరికాలో విడాకులు తీసుకోవటం సర్వసాధారణం. ఆ కోవలోకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ వస్తున్నాడు. తన భార్య వెనీసాతో వున్న 12 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోనున్నారు. వెనీసా మాజీ మోడల్. తన భర్త నుంచి విడాకులు కావాలని సుప్రీం కోర్టుకెక్కింది వెనీసానే అవటం గమనార్హం. తాము విడాకులు తీసుకుంటున్నట్టు ఇద్దరు భార్యాభర్తలు ప్రకటించారు. విడిపోయినా ఒకర్నొకరం ఎప్పటికీ గౌరవించుకుంటామని అన్నారు.జూనియర్ ట్రంప్ (40), వెనీసా (40)లు 2005లో వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలున్నారు. వారికి తామిచ్చే ప్రాధాన్యం ఎప్పటికీ అలాగే ఉంటుందని పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా సంబంధాలపై ప్రత్యేక న్యాయవాదుల బృందం దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరుణంలో కొడుకు విడాకుల వ్యవహారం తెరపైకి రావడం ట్రంప్‌కు తలపోటుగా మారింది. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో జూనియర్ ట్రంప్ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే.