రేవంత్‌‌ రాకపై నాకు వ్యతిరేకత లేదు - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్‌‌ రాకపై నాకు వ్యతిరేకత లేదు

November 1, 2017

మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే  రేవంత్ కాంగ్రెస్‌లోకి రావడం, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణకు ఇష్టంలేదని  కొన్ని కథనాలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ ‘రేవంత్ రాకను నేనెందుకు వ్యతిరేకిస్తాను?  వ్యతిరేకించేవారెవరైనా ఉంటే నా పేరు చెబుతున్నారేమో. రేవంత్‌కు పదవులు ఇవ్వద్దని నేనెందుకంటాను .హైకమాండ్ ఇస్తామంటే వద్దనేవారెవరుంటారు? ’ అని ఆమె అన్నారు.

కొడంగల్‌కు ఉప ఎన్నిక వస్తుందని నేను అనుకోవడం లేదు’ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు.  రేవంత్ రాకను కాంగ్రెస్ పెద్దలు పైకి వ్యతిరేకించకున్నా లోలోపల సణక్కుంటున్నట్లు తెలుస్తోంది. అతడిప్పుడే బాహుబలి కాడని జానారెడ్డి అన్నారు.