అంతర్జాతీయ వేడుకల్లో ‘డూడూ ఢీఢీ’

నవంబరులో హైదరాబాద్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ డూడూ ఢీఢీ’ ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆతిథ్యంలో జరిగే ఈ చిత్రోత్సవంలో వివిధ దేశాల నుండి పలు చిత్రాలు పోటీ పడతాయి. ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రై. లి. పతాకంపై నిర్మితమైన ఈ సినిమా అంతర్ఝాతీయ విభాగానికి ఎంపికైంది.  ప్రపంచవ్యాప్తంగా బాల్యాన్ని కబళిస్తున్న ఒక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని అల్లాణి శ్రీధర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘ సాంకేతిక పరికరాలైన మొబైల్, ట్యాబ్, వీడియో గేమ్స్, ఆన్‌లైన్ గేమ్స్ వంటివి ఈ తరం బాలలపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతున్నయో చెప్పే ప్రధాన ప్రయత్నమే ఈ సినిమా.. ’ అంటున్నారు దర్శకులు  శ్రీధర్. ‘ కొమరం భీమ్’ సినిమాలో నటించిన భూపాల్ ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించారు. మాష్టర్ సాయి, బేబీ కావేరి, బేబీ అభి, వింజమూరి మధు, సంగకుమార్‌లు ఇతర పాత్రల్లో నటించారు.

SHARE