అలా చేస్తే నేను లెస్బియన్నా ? నిత్యామీనన్ - MicTv.in - Telugu News
mictv telugu

అలా చేస్తే నేను లెస్బియన్నా ? నిత్యామీనన్

February 19, 2018

’ చిత్రంలో నిత్యామీనన్ లెస్బియన్ పాత్ర చేసింది. అప్పటినుంచి ఆమెకి సోషల్ మీడియాలో ‘ నిత్యా నువ్వు లెస్బియన్‌వా ? ’ అనే ప్రశ్నలు నెటిజనులు సంధిస్తున్నారు. దీంతో మీడియా ముందుకొచ్చిన నిత్య ‘ నేను లెస్బియన్‌ను కాను. నాకు ఆ అనుభవాలు లేవు. దర్శకుడు కథ చెప్పాడు. నా పాత్ర నాకు నచ్చింది. ఛాలెంజింగ్ రోల్ అనిపించింది. అందుకే ఇష్టపడి ఈ పాత్ర చేశాను. అంతమాత్రం చేత నేను లెస్బియన్‌ను అని చాలా మంది అంటున్నారు. నేను ఇలాంటివాటిని పెద్దగా పట్టించుకోను. నటీనటులు అన్నాక అన్నీ పాత్రలు చెయ్యాలి. ఫలానా పాత్ర చేసినంత మాత్రాన వారు అలాంటివారే అనుకోవటం అపోహ మాత్రమే ’ అంటూ ఘాటుగా స్పందించింది నిత్య.

తనకు ప్రాధాన్యత వున్న పాత్రల్లోనే నటిస్తున్నట్టు వెల్లడించింది. కథ మొత్తం విన్న తరువాతే సినిమా చెయ్యాలా, వద్దా అనేది ఆలోచిస్తున్నానంది. నాకు కథ చెప్పని పెద్ద పెద్ద మలయాళ సినిమాలను వదులుకున్నానని ఈ సందర్భంగా కేరళ కుట్టి నిత్యామీనన్ చెప్పుకొచ్చింది.