శ్రీవల్లి మొదటి 5 నిమిషాలు అస్సలు మిస్సవ్వద్దు... - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీవల్లి మొదటి 5 నిమిషాలు అస్సలు మిస్సవ్వద్దు…

September 14, 2017

బాహుబలి, బజరంగీ భాయిజాన్ సినిమాలతో రచయితగా చక్కని ఫాలోయింగును సంపాదించకున్న రచయిత విజయేంద్ర ప్రసాద్. ఆయన దర్శకత్వం వహించిన ‘ శ్రీవల్లి ’ సినిమా ఈ శుక్రవారం విడుదలౌతున్నది. ఈ సినిమాలోని తొలి 5 నిమిషాల సినిమాను అస్సలు మిస్ అవ్వద్దంటున్నారు. ఎందుకంటే తన కొడుకు రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. సినిమా మొదటి 5 నిముషాల్లో చిత్ర ఉద్దేశ్యాన్ని రాజమౌళి తన మాటల ద్వారా వివరిస్తాడట.

ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే మనిషి మనసులోని ఆలోచనా తరంగాలను స్టడీ చేయడం, తద్వారా ఆ వ్యక్తి గత జన్మ తాలూకు జ్ఞాపకాల్లోకి వెళ్లి, మనసులోని చెడును దూరం చేయడం అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపొందింది.
టీజర్, ట్రైలర్లతో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రంలో రాజమౌళి వాయిస్ ఓవర్ వుండటం మరొక విశేషం. ఈ 5 నిముషాలు చాలా కీలకమని, అస్సలు మిస్ కాకూడదని చిత్ర నిర్మాత సునీత తెలిపారు. రజత్, నేహా హింగే హీరో హీరోయిన్లుగా నటించగా ఎమ్.ఎమ్ శ్రీలేఖ సంగీతాన్ని అందించారు.