బూతులు తెరిస్తే ఓటు వేయండి లేదంటే లేదు… ఉప్పల్‌లో ఆర్వోలు - MicTv.in - Telugu News
mictv telugu

బూతులు తెరిస్తే ఓటు వేయండి లేదంటే లేదు… ఉప్పల్‌లో ఆర్వోలు

December 7, 2018

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. చాలా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల సిబ్బంది రాక ఆలస్యమైంది. మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ కొన్ని చోట్ల ఆలస్యమైంది. ఈ క్రమంలో ఓటర్లు నిరాశకు లోనయ్యారు. ఇదిలావుంటే హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్లో పలుచోట్ల ఇంకా పోలింగ్ బూతులు తెరుచుకోలేదు. 289 పోలింగ్ బూతుకు తాళాలు వేసివున్నాయి.  దీంతో గంటల తరబడి ఓటర్లు పోలింగ్ బూతువద్ద పడిగాపులు పడాల్సి వచ్చింది. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 1403 ఓటర్లు వున్నారు. ఇప్పటి వరకు ఈ కేంద్రాన్ని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.Telugu news Do not vote if you open the booths or else … RO’S in Uppalఈ క్రమంలో ఆర్వోలు, ఇంఛార్జులు, అధికారులకు ఫోన్లు చేస్తుంటే వాళ్ళు ఎత్తటంలేదని అంటున్నారు. బూతులు తెరిస్తే ఓటు వేయండి లేదంటే మానుకోండి అని వారి పీఏలు సమాధానాలు చెప్తున్నారని చెబుతున్నారు.

స్థానిక అధికారులు చేసిన తప్పిదానికి తాము ఓటు హక్కును వినియోగించుకోకూడదా? అని ఓటర్లు అడుగుతున్నారు. దానికి సమీపంలో వున్న మరో పోలింగ్ బూతుకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. ఇదిలావుండగా పలుచోట్ల పోలింగ్ బూతులు ఒకచోట, ఓటర్లకు ఇచ్చిన బూతులు మరోచోట వున్నాయని ఓటర్లు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఇలాగే వుందని, ఇందుకు తామేం చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారని తెలిపారు.