mictv telugu

పిండాన్ని బయటికి తీసి సర్జరీ.. మళ్లీ గర్భసంచిలోకి..   

February 13, 2019

ఆమె ఐదు నెలల గర్భవతి.  భర్తతో కలిసి రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షలు చేసిన డాక్టర్.. బిడ్డకు వెన్నుముక సరిగ్గా ఎదగడం లేదని, అందులో చిన్న రంధ్రం (స్పైనా బై ఫెడా) ఏర్పడటమే ఇందుకు కారణమని షాకింగ్ వార్త చెప్పారు. ఎందుకొచ్చిన సమస్య, చక్కగా అబార్షన్ చేయించుకోండని డాక్టర్లు సూచించారు. ఐదు నెలల పిండం కావడంతో.. బిడ్డకు అపుడపప్పుడే  కనుబొమ్మలు వస్తున్నాయి, పుర్రె, వెన్నుపూస గట్టిపడుతోంది. దీంతో అబార్షన్‌కు ఆ తల్లి మనసు ఒప్పుకోలేదు. కన్నపేగును చంపుకోలేనని, బిడ్డకు ఎలాగైన జన్మనిచ్చి తీరుతానని చెప్పింది.

Telugu News Docs Take Out Unborn Baby From Womb Surgery Puts It Back After Procedure.

దీంతో వైద్యులు ‘ఫీటస్ రిపేర్’ టెక్నిక్‌తో బిడ్డ వెన్నుపూసను సరిచేయొచ్చని చెప్పారు. కానీ తల్లీబిడ్డ ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు. అయినా కూడా ఆ తల్లి వెనక్కి తగ్గలేదు. లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రిలో చేరింది. ఆ గర్భిణి పేరు బెథన్ సింప్సన్. మంగళవారం డాక్టర్లు 4గంటల పాటు సర్జరీ చేశారు. గర్భాన్ని బయటకు తీసి పిండంలోని పాప వెన్నుపూసలో ఉన్న రంధ్రాన్ని పూడ్చారు. తర్వాత మళ్లీ పిండాన్ని బెథన్ గర్భాశయంలో ఉంచారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆ తల్లీ ఆనందానికి అవదులు లేవు. సింప్సన్ జూన్ నెలలో డెలివరీ అవుతుందని డాక్టర్లు వెల్లడించారు. Telugu News Docs Take Out Unborn Baby From Womb Surgery Puts It Back After Procedure