mictv telugu

ఆపరేషన్ థియేటర్లో నర్సుతో రొమాన్స్.. డాక్టర్ సప్సెండ్

January 14, 2019

వైద్య వృత్తి అంటే దైవంతో సమానం. ఒళ్లన్నీ కళ్లే వుండాలి వైద్యులకు. రోగులకు పునర్జన్మ ప్రసాదించే మరు దేవుళ్ళు వాళ్లు. అలాంటప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా వుండాలి ? పేషెంట్లను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆపరేషన్ థియేటర్లో అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగానే వుండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా పేషెంట్ ప్రాణానికే ప్రమాదం. కానీ ఓ డాక్టర్ ఏం చేశాడంటే ఆపరేషన్ థియేటర్‌ను పబ్బు అనుకున్నట్టున్నాడు. నర్సును పట్టుకుని ముద్దు పెట్టి రొమాన్స్ చేశాడు. ఈ వీడియో కాస్త బయటకు రావడంతో సదరు వైద్యుడు వైద్య వృత్తి నుంచి తొలిగిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. 49 సంవత్సరాల సివిల్ సర్జన్ అదే ఆస్పత్రికి చెందిన ఓ నర్సును ముద్దు పెట్టుకున్నాడు. పైగా దాన్ని ఫోన్‌లో వీడియో తీసుకున్నాడు. అది కాస్తా బయటకు వచ్చింది. ఆపరేషన్ థియేటర్‌లో ముద్దులు పెట్టుకున్న డాక్టర్ యవ్వారం జిల్లా కలెక్టర్ శషాంక్ మిశ్రా వరకు వెళ్లింది. వెంటనే కలెక్టర్, ఆ డాక్టరును విధుల్లోంచి తొలగించారు. దీంతో పాటే ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా జిల్లా వైద్య అధికారికి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని త్వరలోనే నివేదిక ఇస్తామని కలెక్టరుకు తెలిపారు.

Telugu news Doctor Kisses Nurse Inside Operation Theatre Of MP Govt Hospital, Gets Sacked Immediately