ట్రాక్టర్ నడుపుతున్న శునకం - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాక్టర్ నడుపుతున్న శునకం

February 12, 2018

విశ్వసానికి మారు పేరు ఎవరు అని అడిగానే  అందరూ కుక్క అని చెబుతారు. ఇది మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జీవి. తెలివితేటల్లోను కుక్కను మించి మరో జంతువు లేద అంటారు. ఉత్తర ఐర్లాండ్ నివాసి ఆల్బర్ట్ రీడ్ దగ్గర ఉండే శునకం పేరు ‘ రాంబో ’. ఇదిప్పుడు చాలా చర్చనీయాశంగా మారింది. ఇది విశ్వాసం ఒక్కటే కాదు.. పనితనాన్ని కూడా చూపుతోంది.
దాని గురించి యాజమాని ఆల్బర్ట్ మాట్లాడుతూ…‘ నేను పొలానికి వెళ్లినప్పడు ఒంటరిగా అనిపించదు. ఎందుకంటే నాకు ఎప్పుడు రాంబో తోడుగా ఉంటుంది. ప్రతి పనిలో నాకు సాయం చేస్తుంది. దర్జాగా ట్రాక్టర్ నడుపుతోంది’ అని ఎంతో ఆనందంగా చెప్పాడు. రాంబోకు శిక్షణను ఇచ్చేందుకు  చాలా కష్టపడ్డాడట. అది కూర్చునేందుకు అనుకూలంగా  ట్రాక్టర్ సీటును అమర్చాడు. ఇక శునకం ట్రాక్టర్ నడుపుతుందని తెలుసుకున్న జనం దానిని చూసేందుకు ఎగపడుతున్నారు.