తోలుమందం మనుషులకంటే.. ఈ కుక్కే నయం - MicTv.in - Telugu News
mictv telugu

తోలుమందం మనుషులకంటే.. ఈ కుక్కే నయం

November 27, 2017

ప్రపంచంలో ప్రతి ఒక్కరిదీ ఇప్పుడు ఉరుకులు, పరుగుల జీవితం అయిపోయింది. పక్కోన్ని పట్టించుకునుడే మానేశాం. అలాంటింది  ఓ మనిషికి ఓ మూగ జంతువు సాయం చేసింది. ఆపదలో ఉన్నది తన యజమాని కాకపోయినా తనకున్న విశ్వాసం ఏంటిందో నిరూపించి ప్రశంసల జల్లులు అందుకుంటోంది ఓ వీధికుక్క..  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


యూరప్ ఖండంలోని ఒక దేశంలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది.  వెనకనుంచి వచ్చిన ఓ దొంగ ఆమెను వెంబడిస్తూ.. చివరికి దగ్గరిగా వెళ్లి ఆమె  బ్యాగును లాక్కోబోయాడు. ఇంతలో ఆ వీధిలో ఉన్న ఓ కుక్క అతనిపై ఒక్కసారిగా సింహంలా దూకింది.

 అతడు వెంటనే ఆమె బ్యాగును వదిలేసి వెంబడిస్తున్న కుక్కను తప్పించుకోవడానికి పరుగులు పెట్టాడు. నిజంగా మనుష్యులందరం ఈ కుక్క నుంచి చాలా నేర్చుకోవాలి.  అవతలి వ్యక్తి ఆపదలో ఉంటే మనకెందుకులే అని  చూడకుండా పోయే ఈరోజుల్లో… ఈ కుక్క అందరికి చక్కని గుణపాఠం చెప్పింది.