కుక్క, గాడిదకు పెళ్లి.. అవేం తప్పు చేశాయి! - MicTv.in - Telugu News
mictv telugu

కుక్క, గాడిదకు పెళ్లి.. అవేం తప్పు చేశాయి!

February 14, 2018

మనుషుల దుర్గుణాలకు, సద్గుణాలను  జంతువులకు ఆపాదించి తృప్తి చెందడం, కచ్చ తీర్చుకోవడం మానవజాతికి మాత్రమే ఉన్న ప్రత్యేక గుణం. తిట్లకు మాత్రమే పరిమితమైన ఈ జీవులను చివరికి పెళ్లి పీటలకు వరకూ లాక్కొచ్చేస్తున్నారు మానవులు. ప్రేమికుల రోజు వేడుకలను వ్యతిరేకిస్తూ భారత్ హిందూ ఫ్రంట్  కార్యకర్తలు వినూత్నంగా కుక్కకు,గాడిదకు పెళ్లి చేశారు.

చెన్నైలోని చురై ప్రాంతంలో  నిరసనకారులు ఈ జంతువుల మెడల్లో పూలదండలు వేయించి, వాటి నుదిటిపై కుంకుమ, పసుపు రాశారు. ఈ కార్యక్రమం ఆనంతరం నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా హిందూ ఫ్రంట్ కార్యకర్తలు  పెద్దఎత్తున నినాదాలు చేస్తుండగా, మరోవైపు మహిళలు హిందూ వివాహాల్లో ఉపయోగించే పెళ్లి సామాగ్రిని ప్లేట్లలో ప్రదర్శించారు.

మరోవైపు హైదరాబాద్‌లో వాలెంటెన్స్‌ డేను వ్యతిరేకిస్తూ భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అహ్మదాబాద్‌లోని సబర్మతీ నదీతీరాన పలు జంటలను భజరంగ్‌దళ్‌ సభ్యులు తరిమికొట్టారు.