తొమ్మిదోసారి ట్రంప్ తాత అయ్యాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

తొమ్మిదోసారి ట్రంప్ తాత అయ్యాడు..!

September 13, 2017

అమెరికా అధ్యక్షకుడు డొనాల్డ్ ట్రంపు తొమ్మిదోసారి తాత అయ్యాడు. ట్రంపు కొడుకు ఎరిక్ ట్రంపు, కోడలు లారా ట్రంపులకు మగపిల్లాడు (ఎరిక్ ల్యూక్ ట్రంపు) జన్మించాడు. ఈ విషయాన్ని ట్రంపు ఆర్గనైషన్ ట్వీట్టర్ ద్వారా తెలిపింది. ట్రంపు తన కొడుకు,కోడలికి ట్వీటర్ ద్వారా శుంభాకాంక్షలు తెలిపాడు. ఎరిక్ ట్రంపు, అతడి సోదరుడు డాన్ జూనియర్ లు ప్రముఖ న్యాయవాదులు  మాత్రమే కాదు, ట్రంపుకు ప్రచార సమయంలో వీరు కూడా కీలకంగా వ్యవహరించారు. ట్రంపు కోడలు లారా ట్రంపు కూడా నాటి అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంపు తరుపున ప్రచారం చేసింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా పని చేస్తున్న నేపథ్యంలో కుటుంబ వ్యవహరాలు, వ్యాపారాలు వీరే చూసుకుంటున్నారు. ట్రంపుకు ఇప్పటికే ఎనిమిదిమంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు.