జోరుగా గాడిద మాంసం అమ్మకాలు - MicTv.in - Telugu News
mictv telugu

జోరుగా గాడిద మాంసం అమ్మకాలు

October 31, 2017

గాడిద పాలకు మంచి గిరాకీ ఉందనుకుంటాం, కానీ గాడిద మాంసానికి కూడా మంచి గిరాకీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో గాడిద మాంసం గిరాకీ జోరుగా సాగుతుంది. మటన్, చికెన్ అమ్మినట్టు అక్కడ గాడిద మాంసాన్ని అమ్ముతున్నారు. అయితే ఈ విషయంలో పర్యావరణ,జంతు పరిరక్షకులు మండిపడుతున్నారు.

గాడిద మాంసాన్ని అమ్మడం నిషేదించాలని కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. గుంటూరు జిల్లాలో ఇష్టానుసారంగా గాడిద వధ జరుగుతోందని, రోడ్లను ఆక్రమించి జంతువులను వధిస్తున్నారని పిటిషనర్లు కోర్టులో పేర్కొన్నారు.