డబుల్ బెడ్‌రూం ఇల్లు వద్దన్న మహిళ..కేటీఆర్ షాక్.. - MicTv.in - Telugu News
mictv telugu

డబుల్ బెడ్‌రూం ఇల్లు వద్దన్న మహిళ..కేటీఆర్ షాక్..

February 2, 2018

‘ నాకు డబుల్ ఇల్లు వద్దు సారూ.. ఇందిరమ్మ ఇచ్చిన జాగల గుడిసె వేసుకొని వున్నా. అది కూలిపోతోంది. దాన్ని తీసేసి రేకుల షెడ్డు కట్టిచ్చి ఆదుకోర్రి సారూ.. ’ అని ఓ మహిళ మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నది. కేటీఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పర్యటించిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నది. అక్కడి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న కేటీఆర్‌తో సదరు మహిళ పై విధంగా మాట్లాడింది.

ఆమె ప్రస్తావనకు  కేటీఆర్ స్పందిస్తూ తనకు బడుల్ బెడ్‌రూం ఇల్లు ఇప్పిస్తానని చెప్పారు. ‘ రెండు సర్కారు ఆస్తులు నాకొద్దు.. లేనోళ్లకు ఆ డబుల్ ఇల్లు ఇయ్యుర్రి ’ అని ఆ మహిళ మంత్రితో అనడం చాలా మందిని ఆశ్యర్యానికి గురి చేసింది.  సర్కారు ఇనాములు ఇస్తానంటే ఎన్నైనా తీసుకోవడానికి సిద్దమయ్యే మనుషులకు ఈ మహిళ ఆదర్శం అనుకున్నట్టున్నారు కేటీఆర్.. వెంటనే స్పందిస్తూ తన సొంత డబ్బులతో ఇల్లు బాగు చేయించి ఇస్తానని ఆమెకు కేటీఆర్ హామీ ఇచ్చారు.