అంబేద్కర్ జయంతి సందర్బంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు... - MicTv.in - Telugu News
mictv telugu

అంబేద్కర్ జయంతి సందర్బంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు…

April 14, 2018

రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్బంగా ఈ రోజు  నగరంలో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్‌బండ్ కేంద్రంగా శనివారం రాత్రి 8 గంటల వరకు అమలులో ఉంటాయి. – కర్బాలామైదాన్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైలింగ్‌ క్లబ్‌  నుంచి కవాడీగూడ చౌరస్తా, డీబీఆర్‌ మీల్స్, ధోబీఘాట్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా పంపుతారు.

-ఎన్టీఆర్‌ ఘాట్‌ నుంచి లిబర్టీ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అంబేద్కర్‌ స్టాట్యూ వైపు అనుమతించరు. వీరు తెలుగుతల్లి చౌరస్తా నుంచి రైట్‌ టర్న్‌ తీసుకుని ఇక్బాల్‌ మీనార్, రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్‌ మీదుగా వెళ్లాలి.

– సైఫాబాద్‌ పాత పోలీసుస్టేషన్‌ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు అంబేద్కర్‌ స్టాట్యూ వైపు వెళ్లకుండా ఇక్బాల్‌ మినార్‌ నుంచి రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్‌ మీదుగా వెళ్లాలి.

– సాధూరామ్‌ కంటి ఆసుపత్రి నుంచి సెక్రటేరియట్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ లిబర్టీ నుంచి కుడి వైపు తిరిగి మొఘల్‌ దర్బార్‌ హోటల్, జీహెచ్‌ఎంసీ కార్యాలయం మీదుగా వెళ్లాలి.