సామాన్యుడిలా క్యూలో ద్రావిడ్.. నెటిజన్ల ఫిదా - MicTv.in - Telugu News
mictv telugu

సామాన్యుడిలా క్యూలో ద్రావిడ్.. నెటిజన్ల ఫిదా

November 24, 2017

చాలామంది సెలబ్రిటీలు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో వీఐపీ సెక్షన్ కింద  ప్రత్యేక దర్శనాలు చేసుకుని వెళ్ళిపోదామనుకుంటారు. అంతవరకు క్యూలో నిల్చున్న జనాల గోస గురించి వారికి ఇసుమంత కూడా ఆలోచన వుండదు. అలాంటి సెలబ్రిటీలకు ఈ సెలబ్రిటీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్  ఆరద్శంగా నిలబడుతున్నాడు. ఇటీవలే ద్రావిడ్ తన ఇద్దరు పిల్లలతో కలసి ఓ సైన్స్ ఎగ్జిబిషన్‌కు వెళ్లాడు. అక్కడ తను తలుచుకుంటే సెలబ్రిటీగా విఐపీ సెక్షన్‌లో ఎగ్జిబిషన్ చూసి వెళ్ళిపోవచ్చు. కానీ రాహుల్ అలా ప్రవర్తించలేదు. సామాన్యుల్లో సామాన్యుడిగా వరుసలో నిలబడ్డాడు. నేనెవ్వరికీ ఎక్కువ కాదని తన ప్రవర్తన ద్వారా చాటాడు. ఈ ఫొటోను తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇప్పుడు ఈ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మరింది.  నెటిజన్లు రాహుల్‌కు జేజేలు పలుకుతున్నారు. రాహుల్ ద్రావిడ్ తనను తానెప్పుడూ ఒక సెలబ్రిటీగా అనుకోడు. సామాన్యమైన జీవితాన్ని గడుపుతుంటాడు. సోషల్ మీడియాలో కూడా తన సెలబ్రిటీ హోదాను ప్రకటించుకోడు.