3,223 కేజీల దొంగ బంగారం స్వాధీనం - MicTv.in - Telugu News
mictv telugu

3,223 కేజీల దొంగ బంగారం స్వాధీనం

December 7, 2018

అక్రమాలకు పాల్పడటంలో ప్రతి సంవత్సరం రికార్డులను పెంచేస్తున్నారు తప్ప తగ్గిచటంలేదని కస్టమ్స్ అధికారులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3,223 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్టుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోయిన సంవత్సరం కన్నా ఇది 103శాతం ఎక్కువ అని చెప్పారు. ఇందుకు సంబంధించిన నివేదికను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్) విడుదల చేసింది. వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.Telugu news DRI seized 3,223 kg gold worth Rs 974 cr in FY'18 ‘2016-17లో రూ.472కోట్ల విలువైన 1,422కేజీల బంగారాన్ని పట్టుకున్నాం. ఆ రికార్డును దాటుతూ 2017-18లో రూ.974కోట్ల విలువైన 3,223కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాం అని డీఆర్ వెల్లడించింది. దిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.89కోట్ల విదేశీ కరెన్సీని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 26,785కేజీల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. కోల్కతా, ముంబయి, చెన్నై, దిల్లీ నగరాల్లో రూ.70.06లక్షల నకిలీ కరెన్సీని సైతం డీఆర్ అధికారులు పట్టుకున్నారని వెల్లడించింది.