ట్రాఫిక్ పోలీసులపై మందుబాబు దాడి! - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాఫిక్ పోలీసులపై మందుబాబు దాడి!

February 10, 2018

మేమేదో మందులో ఉండి రాసింది అన్కునెరు మీరు విన్నది కరెక్టే  మందుబాబే  ట్రాఫిక్ పోలీసులపై  దాడి చేసిన ఘటన జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర జరిగింది. ఫుల్లు రిమ్మమీదున్న దినేష్ పటేల్ అనే యువకుడికి  మందు పరీక్షల 194 పాయింట్లు వచ్చింది.  దీనితో ట్రాఫిక్ పోలీసులు అతని కారును సీజ్ చేసి కేసు బుక్ చేశారు. అంతే అసలే ఫుల్ల్ రిమ్మమీదున్నడు ఇగ కారును సీజ్ జేస్తె ఊకుంటడా…అట్లెట్ల బుక్ చేస్తరు అని పోలీసులను కొట్ట కొట్ట వోయిండు. ఇగ పోలీసులు ఊకుంటరా? తాగింది గాక ఉల్ట మామీదనే  ఉర్కులాడ్తవా? అని కారుతో పాటు మందుబాబును కూడా అదుపులోకి తీసుకున్నరు.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో తనిఖీ చేయగా  మందుతాగి బండ్లు నడిపెటోళ్లు మొత్తం 40 మంది దొర్కిన్రు. అన్ని బండ్లను సీజ్ చేసిన పోలీసులు…మందు బాబులకు రిమ్మ దిగినంక అందరికి  కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.