పెగ్గేశి..ఆడీ కారు అనుకొని ఆంబులెన్స్ తీసుకెళ్లాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

పెగ్గేశి..ఆడీ కారు అనుకొని ఆంబులెన్స్ తీసుకెళ్లాడు..

December 18, 2017

మద్యం మత్తులో మందుబాబులు ఏం చేస్తారో వాళ్లకే తెలయదు. అయితే చెన్నైలో ఓ అనుకోని సంఘటన జరిగింది.  పెగ్గేశి మంచి రిమ్మ మీదున్న తాగుబోతు కారనుకొని ఆసుపత్రి బయటున్న ఆంబులెన్స్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. నగరంలోని పళవాక్కంకు చెందిన మిథిల్ అనే బిజినెస్ మ్యాన్ తన స్నేహితుడికి ఒంట్లో బాగాలేకపోతే.. వెంటనే ఆడికారులో తన స్నేహితున్ని ఆదివారం అర్థరాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. స్నేహితుడిని ఆసుపత్రిలో చేర్పించి తిరిగి వాహనంలో ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరిన తర్వాత వాహనాన్ని చూసిన మిథిల్ కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. ఇదేంటండీ  ఆంబులెన్స్ తెచ్చారు, మన ఆడీకారేదండీ అని చెప్పేసరికి మనోని మందు మొత్తం దిగిపోయింది.పెగ్గేశిన మత్తులో ఆడికారును ఆసుపత్రి దగ్గర వదిలేసి పొరపాటున ఆంబులెన్స్‌ను  తీసుకొచ్చానని అర్థం చేసుకున్నాడు. వెంటనే డ్రైవర్ను పంపించి ఆంబులెన్స్ ను ఆసుపత్రిలో అప్పజెప్పాడు. అయితే అంతకంటే ముందే  ఆంబులెన్సును ఎవరో ఆజ్ఝాత వ్యక్తి అపహరించాడంటూ ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంబులెన్సును తిరిగి తీసుకురావడంతో మిథిల్ పై ఎటువంటి కేసు పోలీసులు నమోదు చెయ్యలేదు.  తాగి వాహనం నడిపినందుకు పెద్ద క్లాస్ పీకి ఫైన్ విధించారు. కానీ మందు మత్తు ఎంత పనిచేసింది అనుకొని మిథిల్ ఆసుపత్రికి సిబ్బందికి క్షమాపణ చెప్పాడట.