mictv telugu

దూడను కాపాడేందుకు ప్రాణాన్ని పణంగా పెట్టి…

January 22, 2019

రోడ్డు ప్రమాదాల్లో ఆవులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం. వాహనాలు ఢీకొని నోరు‌లేని మూగజీవాలు ప్రాణాలు పోయినా.. పట్టించుకుకోకుండా పరారైపోతారు కొందరు వాహనదారులు. కానీ ఓ దూడ ప్రాణాలు కాపాడేందుకు ఓ ట్యాంకర్ డ్రైవర్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. గుజరాత్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

హైవేపై 100 కిలోమీటర్ల స్పీడుతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌కు లేగదూడ అడ్డొచ్చింది. మొదట పూర్తిగా రోడ్డు దాటిన లేదగదూడ మళ్లీ వెనక్కి తిరిగింది. దీంతో ట్యాంకర్ డ్రైవర్ అతని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దూడ ప్రాణాలను కాపాడేందుకు వేగంగా వెళ్తున్న ట్యాంకర్‌ను.. ఒక్కసారిగా బ్రేకులు వేసి కాపాడాడు. అతివేగంతో ఉన్న ట్యాంకర్ బ్రేక్ వేయడంతో గిరున్న తిరిగి.. యూటర్న్ తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ట్యాంకర్ డ్రైవర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నోరు లేని జీవాల ప్రాణాలు పోతే మాకేంటి అనుకునే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు ఉండటం గర్వంగా ఉంది’ అని కామెంట్స్ పెడుతున్నారు.  Driver Survivor To Protect the cow