ఇది తాగుబోతు దీపావళి.. 4 కార్లు, 18 బైకులు బుగ్గి  

తాగితే మనిషిని కానని బెదిరిస్తుంటారు మందుబాబులు. తాగిన మైకంలో విచక్షణ కోల్పోవడం సహజమే. బాగా తాగితే మరిన్ని దురాగతాలు జరుగుతాయి. దేశమంతా దీపావళి సంబరాల్లో మునిగున్న వేళ ఓ తాగుబోతు 18 కార్లకు నిప్పుపెట్టి భయోత్పాతం సృష్టించాడు. దేశ రాజధాని ఢిల్లీలోని మదన్‌గిర్ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిందీ దహనపర్వం.

పీకల దాకా తాగొచ్చిన ఓ వ్యక్తి, వరుసగా వాహనాలకు వరుసబెట్టి నిప్పు అంటించాడు. బైకుల పెట్రోల్ ట్యాంకు నల్లిలను పీకేశాడు. పెట్రోల్ కారుతుండగా దహనం చేశాడు. అర్ధ రాత్రి దాటిపోవడం, పోలీసులకు సమచారం అందడంతో ఇబ్బందుల వల్ల  వాటిని ఆర్పడంలో ఆలస్యమైంది. ఆగ్నిమాపక సిబ్బంది చేరుకునే సరికి వాహనాలు బుగ్గి అయ్యాయి. కాలిపోయిన వాటిలో నాలుగు కార్లతో పాటు 14 బైక్‌లు ఉన్నాయి. సీసీటీవీ కెమెరా దృశ్యాల ద్వారా పోలీసులు తాగుబోతు కోసం గాలిస్తున్నారు.