తాగుబోతు టీచర్  రచ్చ చేసి, ఉచ్చ పోశాడు ! - MicTv.in - Telugu News
mictv telugu

తాగుబోతు టీచర్  రచ్చ చేసి, ఉచ్చ పోశాడు !

March 8, 2018

కొందరు తాగుబోతులు తాగిన తర్వాత ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. మత్తులో ఏదో తెలియని గమ్మత్తు లోకంలో విహరిస్తుంటారు.  ఒక్కోసారి సిగ్గులేకుండా రిమ్మ మీద పిచ్చి పిచ్చిగా ప్రవర్తింటారు. మధ్యప్రదేశ్ లో ఓ తాగుబోతు కూడా అలాగే చేశాడు. ఇంకో విశేషం ఏంటంటే ఈ తాగుబోతు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్ కూడా…

మధ్యప్రదేశ్‌లోొని తికంఘర్‌లో ఉన్న ఓ పాఠశాలకు  టీచర్ ఫుల్లుగా మందు కొట్టి వచ్చాడు. క్లాస్ రూంలోకి వెళ్లి విద్యార్థుల ముందే  తన వెంట తెచ్చుకున్న మందు బాటిల్ ఖాళీ చేశాడు. తాగుబోతు టీచర్ చేష్టలు చూసి విద్యార్థులందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు  విద్యార్థుల ముందే సిగ్గు తప్పిన ఆ టీచర్ మూత్రం పోశాడు. ఈ విషయాన్ని విద్యార్థులు మిగతా టీచర్లకు చెప్పడంతో అతడిని బైటికిి తీసుకు వచ్చి  మత్తును వదిలించే ప్రయత్నం చేశారు. కానీ అతని మత్తు వదలకపోవడంతో స్కూల్ ఆవరణలోనే పడుతూ లేస్తూ నానా హంగామా చేశాడు. ఈ విషయం విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలియడంతో  వెంటనే ఆ టీచర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.