పోలీసులపై మందుబాబుల కసి.. - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులపై మందుబాబుల కసి..

February 17, 2018

ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్నిసార్లు నిర్వహించినా అన్నిసార్లు తాగుబోతులు దొరికిపోతున్నారు. కానీ ఎవ్వరు కూడా అయ్యో పోలీసులు పట్టుకుంటారనే జంకు లేకుండా ప్రవర్తిస్తున్నారు. పైగా పోలీసులను తమను పట్టుకున్నారన్న కసితో వారిని పచ్చి బూతతులు తిడితున్నారు.

శుక్రవారం రాత్రి జూబ్లిహిల్స్‌ రోడ్ నెంబర్ 45 లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఫూటుగా మద్యం తాగిన యువత పట్టుబడ్డారు. పట్టుబడ్డాక వీర లెవల్లో రెచ్చిపోయారు. ముగ్గురు యువకులైతే శ్వాస విశ్లేషణ పరీక్షకు అస్సలు సహకరించలేదు. పైగా మీడియా మీద దాడికి ఒడిగట్టి నడిరోడ్డు మీద వీరంగం సృష్టించారు.

ఓ యువతి సైతం ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నించింది. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించి ఆమె మీద కేసు నమోదు చేసి, ఆమె కారును సీజ్‌ చేశారు. చాలా మంది యువకులు మద్యం తాగి దొరికి పోలీసుల పట్ల చాలా దురుసుగా వ్యవహరించారు. నోటికొచ్చినట్టు పోలీసులను దూషించారు. ఓ దశలో దాడి చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఎస్సై నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆరు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది కార్లను స్వాధీనం చేసుకున్నారు.