తాగుబోతు సిఐకి తగిన శాస్తి జరిగింది. హైద్రాబాద్‌లో రేంజ్ సీఐగా పనిచేస్తున్న గిరీశ్రావ్ పీకలదాకా తాగి కారు నడిపి యాక్సిడెంట్ చేస్తే పలువురికి గాయాలు అయిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ సీరియస్ అయ్యారు. తాగుబోతు సిఐ గిరీశ్రావ్ను సస్పెండ్ చేశారు.
యాప్రాల్ దగ్గరలో మద్య మత్తులో కారు నడుపుతూ సిఐ గిరీశ్ రావ్ ఎదురుగా వస్తున్న మూడు మోటార్ బైకులను, ఓ ఆటోను గుద్దాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. గిరీశ్ కు బ్రీత్ అనలైజర్‌తో పరీక్ష జరపగా 230 పాయింట్లు తాగినట్లు తేలింది.