ధనలక్ష్మి ఏకపక్షపాతం.. భారతీయులకు జాక్ పాట్లు - MicTv.in - Telugu News
mictv telugu

ధనలక్ష్మి ఏకపక్షపాతం.. భారతీయులకు జాక్ పాట్లు

March 5, 2018

భారతీయులకు ‘బిగ్ టికెట్’ జాక్‌పాట్ తగిలింది. సోమవారం  దుబాయ్‌లోని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన లక్కీ డ్రాలో ఏడుగురు భారతీయులకు డబ్బు పంట పడింది. కేరళకు చెందిన థాన్సిలాస్‌ బాబు మాథ్యూస్ 7 మిలియన్ల దినార్‌లు (రూ. 12.5 కోట్లు) గెలుచుకున్నాడు. ఈ లాటరీ తగటడం  నమ్మలేకపోతున్నానని థాన్సిలాస్‌ అన్నాడు. గత నెలలో రాఫెల్‌ బొనాంజా బిగ్‌ లక్కీ మిలియనీర్‌ లాటరీ టికెట్‌ నెంబర్‌ 030202 కొనుగోలు చేయగా, డ్రాలో పెద్ద మొత్తమైన 12.5 కోట్లు గెలుచుకున్నాడు.మరో ఆరుగురు భారతీయులు ఒక్కొక్కరు దాదాపు 18 లక్షలు గెలుపొందారు. బిగ్‌ టికెట్‌ లక్కీ డ్రాలో గెలిచిన మొత్తం 8మంది విజేతల్లో అత్యధికంగా భారతీయులు  ఉండగా, బెహ్రెయిన్‌‌కు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులకు రావడంతో విజేతలు ఆనందంతో మునిగిపోతున్నారు.