కదిలిస్తున్న బిర్యానీ కథ… ఒక్కసారి తింటాను.. తర్వాత నా పొట్టను తొలగించండి... - MicTv.in - Telugu News
mictv telugu

కదిలిస్తున్న బిర్యానీ కథ… ఒక్కసారి తింటాను.. తర్వాత నా పొట్టను తొలగించండి…

September 25, 2018

కుటుంబంతో సంతోషంగా ఉన్న ఓ వ్యక్తికి సడెన్‌గా వాంతులు అవ్వడం, భారీగా బరువు తగ్గిపోయాడు. దీంతో తనకు ఏం అయిందో అర్థంకాక వైద్యులను సంప్రందించాడు. అతణ్ణి పరీక్షించిన వైద్యులు తనకు కేన్సర్ వచ్చిందని, అది కూడా పైనల్ స్టేజ్‌లో ఉందని చెప్పారు. ఒక్కసారిగా షాక్‌కు గురై, అతను కన్నీరుమున్నీరు అయ్యాడు. తన చివరి కోరిక వైద్యులకు చెప్పి, నేరవేర్చుకున్నాడు.

A man asks for biryani before getting stomach removed in Dubai

వివరాల్లోకి వెళ్తే… దుబాయ్‌కు చెందిన గులామ్ అబ్బాస్ అనే వ్యక్తి ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన చాలా సంతోషంగా తన కుటుంబంతో జీవిస్తున్న సమయంలో అతని జీవితంలోకి క్యాన్సర్ మహమ్మారి వచ్చింది. దీంతో అతను కుప్పకూలిపోయాడు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన అబ్బాస్‌ను పరిశీలించిన వైద్యులు  కడుపులో కేన్సర్ వచ్చిందని, అది కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉందని చెప్పారు. వెంటనే కడుపును తొలగించాలి, లేకపోతే చనిపోతావని చెప్పారు. అబ్బాస్ తను లేకుండా తన పిల్లలు ఉండలేరని, వారి ఎదుగుదలను తాను చూడాలని వైద్యులను కోరాడు. దీంతో అబ్బాస్ పొట్టను తొలింగించడానికి వైద్యులు పూనుకున్నారు. సర్జరీ చేసే ముందు తన చిన్న కోరిక తీర్చాలని డాక్టర్లను వేడుకున్నాడు అబ్బాస్.

ఇకపై నేను జన్మలో తనకు ఇష్టమైన తన భార్య చేసే బిర్యానీ తినడం కుదరదు. కాబట్టి ఆపరేషన్ చేసే ముందు ఒక్కసారి బిర్యానీ తింటానని వైద్యులను వేడుకున్నాడు. దీంతో వైద్యులు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ కదిలిస్తున ఒకే ఒక్క ప్రశ్న…. పొట్ట లేకుండా అబ్బాస్‌ ఎలా బతకగలడు అని ? అయితే పొట్ట లేకుండా బతకడమంటే.. అసలు తినకపోవడం కాదని, స్పైసీగా లేని, తక్కువ మొత్తంలో ఆహారం అబ్బాస్‌ తీసుకోగలగడని డాక్టర్లు చెబుతున్నారు. పొట్ట లేకుండా ఉన్నవారు తీసుకునే ఆహారాన్ని అన్నవాహిక నుంచి నేరుగా చిన్న ప్రేగులకు తరలించవచ్చని కన్సల్టెంట్‌ లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్‌ అల్ మార్జౌకి తెలిపారు.

తాము పెద్ద ప్రేగు క్యాన్సర్‌ సర్జరీలు చాలా చేశామని, కానీ పొట్టమొత్తం తీసేసే సర్జరీని చేయడం ఇదే తొలిసారని డాక్టర్‌ తెలిపారు.   ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న క్యాన్సర్‌ సంబంధిత మరణాల్లో పొట్ట క్యాన్సర్ ఒకటిగా ఉంది. ఇలాంటి కేసులు ఈమధ్య తరచుగా నమోదవుతూనే ఉన్నాయి. యువతకు ఈ క్యాన్సర్‌ ఎక్కువగా విస్తరిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.