దుబాయ్ కొనుగోళ్లలో మనోళ్లే ఫస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

దుబాయ్ కొనుగోళ్లలో మనోళ్లే ఫస్ట్

October 27, 2017

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌‌లో ఆస్తులను కోనుగోలు చేయడంలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. 2016 జనవరి నుంచి జూన్ 2017 వరకు అక్కడ మనోళ్లు రూ. 42 వేల కోట్ల విలువైన ఆస్తులను సొంతం చేసుకున్నారు.

ముంబై, పుణే, అహ్మదాబాద్‌కు చెందినవారు దుబాయ్‌‌లోఆస్తులను కోనుగోలు చేస్తున్నారు. ఎనిమిది శాతం మంది రూ. 6.5 కోట్ల వెచ్చించేందుకు కూడా రెడీ అవుతున్నారు.రూ. 65 లక్షల నుంచి రూ. 3.24 కోట్లు పెట్టి కోనేందుకు కొందరు మెుగ్గుచూపుతున్నారు. ఎక్కువమంది అపార్ట్‌మెంట్లను కోనుగోలు చేస్తుండగా, మరికొందరు విల్లాలు కోనేందుకు ఆసక్తిని చూపుతున్నారు. దుబాయ్ ‘ప్రాపర్టీషో’ నిర్వహించిన ఆద్యయనంలో తేలింది.  9 శాతం మంది భారతీయులు కమర్షియల్  ఆస్తులను, 6 శాతం మంది స్థలాలను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. దుబాయ్  ఇన్వెస్టర్లకు అందుబాటు ధరల్లో ఆస్తులను అందిస్తోంది. రూపాయి విలువ పెరగడంతో  కూడా ఆస్తులను కోనుగోలు చేసేందుకు ఊతం లభించిందని ఆద్యయనం పేర్కొంది.గత ఏడాది రూ.12.000 కోట్ల ఆస్తులను భారతీయులు కొనుగోలు చేశారు.