బాల్యమిత్రులు.. 6.5 కోట్ల జాక్‌పాట్ కొట్టారు - MicTv.in - Telugu News
mictv telugu

బాల్యమిత్రులు.. 6.5 కోట్ల జాక్‌పాట్ కొట్టారు

April 11, 2018

వారిద్దరూ ప్రాణస్నేహితులు. ఒకే ప్రాంతంలో పుట్టి, పెరిగి, ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఇద్దరి జీవితాలను ఓ లాటరీ టికెట్ పూర్తిగా మార్చేసింది. కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన సెబాస్టియన్, పాల్ తొమ్మాన దుబాయ్‌లో 12 ఏళ్లుగా చిన్నపాటు ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. వీరు ఇటీవల దుబాయ్ డ్యూటీ ఫ్రీ సంస్థ నుంచి ఓ లాటరీ టికెట్ కొన్నారు. వీరి కొన్న టికెట్‌కు 1మిలియన్ యూఎస్ డాలర్ల(రూ. 6.5 కోట్లు) లాటరీ తగిలింది.

లాటరీ తగిలిందని తమకు ఫోన్ వచ్చిందని, అయితే ఎవరో ఆటపట్టిస్తున్నారని పట్టించుకోలని సెబాస్టియన్ చెప్పారు. తర్వాత నంబర్ చెక్ చేసుకుంటే నిజమేనని తేలడంతో ఉప్పొంగిపోయామన్నారు.