బోనీ‌కపూర్‌ను 4 గంటలు ప్రశ్నించిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

బోనీ‌కపూర్‌ను 4 గంటలు ప్రశ్నించిన పోలీసులు

February 26, 2018

శ్రీదేవి మృతిపై ఆమె భర్త బోనీకపూర్ వాంగ్మూలాన్ని దుబాయ్ పోలీసులు రికార్డు చేశారు.  రషీద్‌ ఆస్పత్రికి చెందిన ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు అటెండెంట్ల వాంగ్ములాన్ని రికార్డు చేశారు. దాదాపు 4 గంటలపాటు బోనీకపూర్‌ను ప్రశ్నించారు. రికార్డెడ్‌ ఆన్‌ కెమెరా ముందు బోని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్టు వెల్లడైంది. అపస్మారక స్థితిలో వున్న  శ్రీదేవిని రషీద్‌ ఆస్పపత్రికి తరలించిన సమయంలో బోనితో పాటు ఉన్న మరో ముగ్గురు వ్యక్తుల వాంగ్ములాన్ని కూడా పోలీసులు రికార్డు చేశారు.

నీటితో నిండివున్న బాత్‌టబ్‌లో శ్రీదేవి అపస్మారక స్థితిలో వున్నట్టు గుర్తించినట్టు బోనీ చెప్పినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. శనివారం రాత్రి 7 గంటల సమయంలో బాత్రూంకి వెళ్లిన శ్రీదేవి, బాత్రూంలో కాలు జారి నీళ్ల టబ్‌లో పడిపోయిందని, ఆ సమయంలో ఊపిరాడక చనిపోయినట్టు యూఏఈ ఆరోగ్యశాఖ ఫోరెన్సిక్‌ రిపోర్టును విడుదల చేసింది. శ్రీదేవి బాత్‌రూంలోకి వెళ్ళి నీటితో నిండివున్న బాత్‌టబ్‌లో పడిపోయింది.

కొద్ది సేపటికి హోటల్ గదికి వచ్చిన బోని శ్రీదేవిని ఎంత పిలిచినా పలకకపోవటంతో హోటల్ సిబ్బందిని పిలిచాడు. హోటల్ సిబ్బంది సాయంతో బాత్‌రూం డోర్లు పగులగొట్టి చూసేసరికి శ్రీదేవి అపస్మారక స్థితిలో పడివుంది. వెంటనే రషీద్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ఊపిరి ఆడక మ‌ృతి చెందిందని డాక్టర్లు ధ్రువీకరించారు. శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్‌ను గుర్తించినట్టు యూఏఈ రిపోర్టు పేర్కొంది. కానీ గుండెపోటు గురించి అసలు ఫోరెన్సిక్‌ రిపోర్టు ప్రస్తావించకపోవటం గమనార్హం.