శ్రీదేవి మృతిపై అనుమానాలున్నాయి...మృతదేహాన్ని అప్పగించలేం! - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి మృతిపై అనుమానాలున్నాయి…మృతదేహాన్ని అప్పగించలేం!

February 26, 2018

శ్రీదేవి చనిపోయి దాదాపు 50 గంటలకు పైగ కావస్తున్నా  కూడా ఆమె భౌతికకాయం మాత్రం ఇంకా దుబాయ్‌లోనే ఉంది. ఆమె మృతిపై అనేక అనుమానాలున్నాయని, అందుకే ఈరోజు మృతదేహాన్ని అప్పగించలేమని దుబాయ్ అధికారులు స్పష్టం చేశారు. మొదట శ్రీదేవి గుండెపోటుతో చనిపోయిందని  అనుకున్నారు అందరు, కానీ ఫోరెనిక్స్ రిపోర్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆమె గుండె పోటుతో మరణించలేదని, బాత్రూంలోని బాత్‌టబ్‌లో పడి ప్రమాదవశాత్తు చనిపోయిందని నిర్థారించారు. అయితే శ్రీదేవి రక్త నమూనాలో కూడా ఆల్కాహాల్ బయటపడింది. అయితే ఒక మనిషి అలా బాత్‌టబ్‌లో పడిపోయి చనిపోయిందని ఎలా నిర్థారణకు వస్తారని దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారి ప్రశ్నించారు. ఈ కేసులో మరింత విచారణ అవసరమని దుబాయ్ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసును దుబాయ్ ప్రాసిక్యూషన్ కు అప్పగించడంతో ఆమె మృతదేహం భారత్‌కు రావడానికి ఇంకా సమయం పట్టేటట్టుంది.

ఈ కేసులో బోనీ కపూర్‌ను 3 గంటల పాటు ప్రశ్నించిన దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు, ఆయన సమాధానాలతో తృప్తి చెందనట్లు తెలుస్తోంది. అందుకే ఈ కేసు తేలేవరకు  బోనీకపూర్‌ను దుబాయ్‌లోనే  ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మృతదేహాన్ని అప్పగించేందుకు దానికి సంబంధించి  మరిన్ని పత్రాలు కావాలని భారత కాన్సులేట్‌ను కోరినట్లు దుబాయ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే  శ్రీదేవీ భౌతికకాయాన్ని చూద్దామని ఆమె అభిమానులు  భారీగా ఆమె ఇంటివద్దకు చేరుకుంటున్నారు. బహుశా  మంగళవారం శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.