డంబెల్స్, వైన్ గ్లాసులు.. పెళ్లికొచ్చే అతిథులకు గిఫ్ట్స్ లిస్ట్ ఇచ్చిన ప్రియాంక… - MicTv.in - Telugu News
mictv telugu

డంబెల్స్, వైన్ గ్లాసులు.. పెళ్లికొచ్చే అతిథులకు గిఫ్ట్స్ లిస్ట్ ఇచ్చిన ప్రియాంక…

November 22, 2018

దీపికా ప‌దుకొనె, ర‌ణ్‌వీర్ సింగ్‌ల పెళ్లి గురించి ఇంకా జనాలు మరిచిపోనేలేదు. అప్పుడే మరో సెలెబ్రిటీ జంట పెళ్లి ముచ్చట తెరమీదకు వచ్చింది. ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌ల పెళ్లి డిసెంబ‌ర్ 3న జోధ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ నెల‌ఖ‌రు నుంచి పెళ్లి సందడి మొద‌లు కానుంది. దీప్‌వీర్ దారిలోనే ప్రియాంక కూడా తన పెళ్లి కానుకల విషయంలో అతిథులకు ఆర్డర్లు వేసింది. దయచేసి తన పెళ్లికి వచ్చేవాళ్ళు తాను చెప్పిన కానుకలను మాత్రమే తీసుకురావాలని కోరింది.Telugu news Dumbbells and wine glasses .. Priyanka gave gift list to guests before marriage …అలా చేస్తేనే తాను ఆనందిస్తానని, అందులోనూ అమెజాన్‌లో కొని బహూకరిస్తే ఇంకా ఆనందిస్తానని కోరికోరి చెప్పింది. అమెజాన్‌తో ఓ డీల్ కుదుర్చుకొని తాను రిజిస్ట్రీ చేసిన వ‌స్తువుల‌ని అమెజాన్‌లో కొనాల‌ని కోరింది. ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం యూనిసెఫ్‌కి ప్ర‌చార క‌ర్తగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఈ క్ర‌మంలో అమెజాన్ ద్వారా వ‌చ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ఆ సంస్థ యూనిసెఫ్‌కి విరాళంగా ఇవ్వ‌నుందట‌.

ప్రియాంక కోరిన కానుకల జాబితా ఇదే…

కిచెన్‌లోకి అవసరమైన చెంచాలు

ఫోర్కులు

డిన్నర్‌ ప్లేట్లు

వైను గ్లాస్‌లు

డంబెల్స్‌

ట్రావెల్‌ బ్యాగులు

తలగడలు

పరుపులు

టూత్‌ బ్రష్‌లు

రూ.1.70 లక్షల విలువైన ఓఎల్‌ఈడీ టీవీ

వీటితో పాటు తనకు ఇష్టమైన పెంపుడు కుక్క డయానా కోసం కూడా కానుకలు కోరింది.

దాని కోసం గులాబీ రంగు నెక్‌ కాలర్‌, పెట్‌ బెడ్‌, రెయిన్‌ కోట్‌, పెట్‌ జీపీఎస్‌ ట్రాకర్‌లను బహుమతిగా ఇవ్వాలని పేర్కొంది. ఎక్కడైనా పెళ్లికి అతిథులను ఆహ్వానించేవరకే మన పని. కానీ ఇలా అతిథులకు కానుకల గురించి ముందే చెప్పడం మన దగ్గర చాలా నామోషీగా ఫీలవుతాం. కానీ ఇది విదేశాల్లో మామూలే.