నకిలీ పెళ్లిళ్లు.. ఎందుకో తెలిస్తే షాక్! - MicTv.in - Telugu News
mictv telugu

నకిలీ పెళ్లిళ్లు.. ఎందుకో తెలిస్తే షాక్!

February 27, 2018

రోజులు చాలా మారిపోయాయి. ఏది ఉత్తిదో ఏది అసలుదో తెలుసుకోలేని సందిగ్ధం ఏర్పడింది. వియత్నాంలో అలాంటి ఓ ఉత్తిత్తి వివాహం జరిగింది. ఏంటీ.. ఏదో సినిమాలో చూపించినట్టు ఉత్తిత్తి వివాహమా ? అని ఆశ్చర్యపోకండి.  ఇలాంటి నకిలీ పెళ్ళిళ్ళు అక్కడ కొత్తేమీ కాదు. అక్కడ నకిలీ పెళ్లిళ్ళు అనేది అతి సాధారణ విషయం. పెరుగుతున్న టెక్నాలజీ ముసుగులో యువత కూడా టెక్నికల్‌గా ఆలోచిస్తూ ముందుకు పోతున్నారనటానికిది నిట్టనిలువు నిదర్శనం. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఆ అమ్మాయి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి వచ్చిన వారికి దేనికీ తక్కువ కాకుండా అన్నీ మర్యాదలు చేశారు అమ్మాయి తరుపువాళ్ళు. పెళ్లి మండపంలో ఎటు చూసినా సందడే సందడి.వీడియో కూడా తీశారు. ఆ పెళ్లికి వచ్చిన అక్కడి స్థానికాధికారులు వచ్చిఆమె పెళ్ళి జరిగినట్టు అధికారిక ధ్రువపత్రం జారీ చేశారు. వాళ్లలా వెళ్ళిపోయిన ఓ 20 నిమిషాలు అందరూ వున్నారు. ఆ తర్వాత ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అలా నిమిషాల వ్యవధిలో పెళ్లికొడుకు సహా అందరూ వెళ్లిపోయారు. పెళ్ళికూతురు ఒక్కర్తే మిగిలింది. పెళ్లికూతురు ముఖంలో అందరూ తనను వదిలేసి వెళ్ళిపోయారనే ఆందోళన కించిత్ కూడా కనిపించలేదు. కారణం అది ఉత్తిత్తి పెళ్ళి కాబట్టి. నటీనటులు సినిమాల్లో తమ పాత్ర పరిధి నటించి పారితోషకం తీసుకొని వెళ్లినట్టు వాళ్ళంతా వెళ్లిపోయారు. పెళ్ళికొడుకు తరుపున ఒకరు అత్తయ్యారు, ఇంకొకరు అన్నయ్యారు, ఒకామె అక్కయ్యంది. ఇలా ఎన్నో పాత్రలు పోషించిన వారంతా పేమెంట్ల పరిధి నటించి తుర్రుమన్నారు.

ఇంతకీ అసలు విషయంలోకి వస్తే… పెళ్లి కూతరైన ఆ అమ్మయి ఇప్పుడు మూడు నెలల గర్భిణి. ఈ నిజం తెలిస్తే ఇంట్లో వాళ్లు ఎక్కడ ఆమెను చంపేస్తారోనని ఈ తతంగాన్ని నడిపింది. పెళ్లి  కాకుండా తల్లయిందన్న నిజం ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నట్టు నటించింది. కొన్ని రోజులయ్యాక తన భర్తతో తనకు మనస్పర్దలు వచ్చి విడాకులు తీసుకున్నాట్టు కొత్త సీన్ క్రియేట్ చేసి చెప్పొచ్చని ఆ అమ్మాయి ప్లాన్ వేసుకుంది. ఎలాగోలా డబ్బు ఖర్చు చేసి పెళ్ళి ప్లాన్ సక్సెస్ చేసింది గానీ విడాకుల ప్లానే ఎలా చేస్తుందో మరి ?

అక్కడ ఇలాంటి అద్దె పెళ్ళిళ్ళు ఎన్ని జరిగాయో లెక్కే లేదంటున్నారు అద్దె బంధువుల వ్యాపారుల్లో  ఒకరైన  ఎన్‌గుయాన్‌ షువాన్‌ అంటున్నారు. పెళ్ళి కాకుండా తల్లి అవటం వల్లే అమ్మాయిలు ఇలాంటి ఉత్తుత్తి పెళ్లిళ్ళకు పూనుకుంటున్నారట. ఇంట్లోవారి ప్రతిష్ఠ దెబ్బ తినకుండా వుండటానికి 70శాతం యువత భావిస్తున్నట్లు ఇవాన్‌ ఇయాన్‌ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటున్నారు.

ఇలా ఈ ఒక్క అమ్మాయే కాదు  వియత్నాంలోని అనేకమంది యువతులది ఇదే దారి. నిజమే వియత్నాంలో అద్దెకు బంధువులు, వరుడు, వధువు దొరికే బిజినెస్‌ లాభదాయకంగా ఉన్నట్టు  సమాచారం. వియత్నాంలో 30ఏళ్ల లోపు  వయసు కలిగిన వాళ్లు 93మిలియన్ల మంది ఉన్నారు.ఇక్కడ యువతీయువకులు సహజీవనం చేసే పద్ధతి ఎక్కువగా ఉండటంతో 30%కి పైగా యువత అద్దె వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా గత పదేళ్ల కాలంలో అబార్షన్ల రేటుకూడా పెరిగిందని అక్కడి నేర, వైద్య విభాగ అధికారులు చెబుతున్నారు. అయితే సహజీవనం చేసిన తర్వాత సామాజిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇలా అద్దె వివాహాలు చేసుకుంటున్నారు. ఒక్కోసారి తల్లిదండ్రులు కూడా ఇలాంటి పెళ్లిళ్ళు చేస్తున్నారని సమాచారం.