చెత్తకుండి.. మాకు దేవుడండి.. - MicTv.in - Telugu News
mictv telugu

చెత్తకుండి.. మాకు దేవుడండి..

October 30, 2017


మన దేశంలో ప్రతి రాయిని, చెట్టును, పుట్టను భగవంతుడి స్వరూపమని పూజించడం సర్వపాధారణమే. కానీ డస్ట్‌బిన్‌ను దేవుడి రూపంగా  పూజించడాన్ని చూశారా? చెత్తకుండీని  భగవతుని స్వరూపంగా పూజించడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా!

చెత్తకుండీకి మహిళలు పూజ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బిహార్ లోని ఓ పట్టణంలో ఆలయం సమీపంలో కంగారూ రూపంలో ఉన్న డస్ట్ బిన్‌కు కొందరు మహిళలు నీళ్లు చల్లి పూజలు చేస్తున్నారు. పసుపు రంగులో ఉన్న డస్టబిన్‌కు  నీళ్లు చల్లి ,పసుపు, కుంకుమ , పూలతో పూజలు చేస్తూ , తమ మెుక్కులు తీర్చుకుంటున్నారు. కొందురు ఆ కుండీని హుండీగా భావించి అందులో పూలు, చిల్లర కూడా వేస్తున్నారు.  ఆలయంలో గంట మోగుతున్న శబ్దం కూడా వినిపిస్తోంది. చాత్ పూజ సందర్భంగా ఈ వ్యవహారం చోటుచేసుకుంది. కంగరూను చూసి వినాయకుడి వాహనం ఎలుకగా భావించి ఉండవచ్చని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆ మహిళలు అలాంటి చెత్తకుండీని చూడ్డం అదే తొలిసారి కనుక పొరబడి దేవుడనుకుని ఉంటరని చెబుతున్నారు.