20 లగ్జరీ కార్లను బుల్డోజర్లతో  తొక్కించాడు ! - MicTv.in - Telugu News
mictv telugu

20 లగ్జరీ కార్లను బుల్డోజర్లతో  తొక్కించాడు !

February 7, 2018

మనదేశంలో కస్టమ్స్ అధికారులకు పన్ను కట్టకుండా   అక్రమంగా ఏదైనా వస్తువులు  దొరికితే  ఏం చేస్తారు.  వాటిని కొన్న వారికి జరిమానా విధిస్తారు. లేకపోతే  ఆ వస్తువులను స్వాధీనం చేసుకుని  వాటిని వేలం వేస్తారు.  కానీ ఫిలిప్పీన్స్  దేశ అధ్యక్షుడు  తన రూటే వేరు  అని అంటున్నాడు.

ఒకటి కాదు రెండు కాదు ఆడి, మెర్సిడిస్ బెంజ్ వంటి 20 కార్లను  ఆ దేశ అధ్యక్షుడు దగ్గరుండి మరీ బుల్డోజర్లతో తొక్కించాడు.  ఎందుకంటే  ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా  ఇతర దేశాల నుండి  ఈకార్లను కొందరు డబ్బున్న మారాజులు దిగుమతి చేసుకున్నారట. ఒకవేళ వాళ్లకు జరిమానా వేస్తే  ఇంకో కారు తెప్పిచ్చుకుంటారు అందుకని  ఇలా వినూత్నంగా  తెచ్చిన కార్లను తుక్కు తుక్కు చేయించాడు.  వాటి విలువ దాదాపు 11,83000 అమెరికా డాలర్లు అంటే మన కరెన్సీలో 7 కోట్ల 58 లక్షలకు పైగానే.  ఈ కార్లను  తుక్కు తుక్కు చేసిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈవీడియో  చూస్తున్న నెటిజన్లు  అయ్యో అంత లగ్జరీ కార్లను  పాత సామాన్లకు కూడా పనికి రాకుండా చేస్తున్నారే అని బాధపడ్డారు.

ఆ దేశ అధ్యక్షుడు ఇప్పుడే కాదు గతంలో కూడా అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్న ముఠాపై  కఠిన శిక్షలు విధించి, కొంతమందికి ఉరిశిక్షను కూడా అమలు చేశాడు.