mictv telugu

నిరుద్యోగులకు శుభవార్త…  అమెజాన్‌లో జాబ్ మేళా

January 14, 2019

భారతీయ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొత్త ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిలో ఇండియాలోనే 1,300 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించింది. జాబ్ ఓపెనింగ్స్‌కు సంబంధించి డేటాను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది. ఆసియా ఫసిఫిక్‌ రీజియన్‌లోనే అత్యధికంగా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నట్టు పేర్కొంది. అంటే.. చైనాలోని అమెజాన్ ఉద్యోగాలు కంటే మూడు వంతులు భారత్‌లోనే అధికం. టెక్నాలజీ రంగాన్ని మినహాయిస్తే.. చాలా కంపెనీలలో ఈ-కామర్స్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో 1,286 ఉద్యోగాలు ఉంటే.. చైనాలో 467 ఉద్యోగాలు, జపాన్‌లో 381 ఉద్యోగాలు, ఆస్ట్రేలియాలో 250, సింగపూర్‌లో 174 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి.

Telugu News e-commerce company amazon to recruit employees in india .

ఈ సందర్భంగా అమెజాన్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ… అమెజాన్ వ్యాపారాభివృద్ధికి భారత్ సుస్థిరమైన ప్రదేశమని అన్నారు. అమెజాన్ బృందాలు భారత్‌లో పనిచేసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాయని, ఇదే సంస్థ వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎఫ్‌డీఐ పాలసీపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ కొత్త ఉద్యోగాల ప్రక్రియ పాలసీకి అనుగుణంగానే ఉంటుందని సంస్థ నిపుణులు విశ్వసిస్తున్నారు.

Telugu News e-commerce company amazon to recruit employees in india