వేలిముద్రలు మరిచిపోండి.. చెవిముద్రలు వేయండి.. - MicTv.in - Telugu News
mictv telugu

వేలిముద్రలు మరిచిపోండి.. చెవిముద్రలు వేయండి..

February 11, 2019

ఓటరు కార్డు, ఆధార్ కార్డు..నానా కార్డుల కోసం వేలిముద్రలు ఇస్తుంటాం. గుర్తింపులో ఇవి కీలక పాత్ర పోషిస్తుంటాయి. దొంగలను పట్టిస్తుంటాయి. అయితే వేలిముద్రలకు కూడా నకిలీలను తయారు చేస్తుండండంతో శాస్త్రవేత్తలు కొత్తరకం ముద్రలపై అధ్యయనం చేస్తున్నారు. వేలిముద్రలకు బదులు చెవిముద్రలు వాడితే నకిలీను అరికట్టొచ్చని, వీటిని కాపీ కొట్టడం అంత సులువు కాదని అంటున్నారు.

Telugu news EARS be the new fingerprints Scientists say ear recognition could.

సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన మార్క్ నిక్సన్ బృందం చెవిముద్రలపై అధ్యయనం నిర్వహిస్తోంది. వేలిముద్రలు, ఫేసియల్ రికగ్నిషన్ వంటి వాటితో పోలిస్తే చెవిముద్రలతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నట్లు వారి అధ్యయనంలో తేలింది. చెవులు జీవితాంతం పెరుగుతూనే ఉన్నా, వారి ప్రాథమిక అమరికలో మార్పులు వుండవని చెబుతున్నారు.

‘చెవుల నిర్మాణం స్థిరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మారే  ముఖ నిర్మాణం కంటే ఇవే బెటర్. ఫోన్ లాక్‌కు చెవిముద్రలను వాడుకోవచ్చు. ఐరిస్, రెటీనా, వేలిముద్రలతో పోలిస్తే ఇవి పెద్దవి కనుక సులభంగా గుర్తించవచ్చు. రాపిడి వల్ల వేలిముద్రలు అరిగిపోతాయి. కానీ చెవిముద్రలు అలా కాదు. వీటికి నకిలీలను చేయడం కష్టం..’ అని నిక్సన్ పేర్కొన్నారు. Telugu news EARS be the new fingerprints? Scientists say ear recognition could be used to catch criminals and unlock phones because body part retains unique features and proportions