mictv telugu

జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.6

January 10, 2019

జమ్మూ కశ్మీర్‌లో భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఈ ఉదయం రిక్టర్‌ స్కేలుపై భూ ప్రకంపనల తీవ్రత 4.6 నమోదైంది. భవనాల్లోని వస్తువులు కదిలాయని, కొన్ని చోట్ల పాత గోడలు, ఇళ్లు కూలాయని సమాచారం. అయితే ఎంతమేర ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందనేది ఇంకా తెలియరాలేదు. భూకంపం సంభవించిన మాట వాస్తవమేనని, ఇది చాలా స్వల్పమైనదేనని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనల ప్రభావం హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ కనిపించిందని చెప్పారు.Telugu news Earthquake of magnitude 4.6 hits Jammu and Kashmir