బీఫ్ తినండి కానీ ఫెస్టివల్స్ అవసరమా ? - MicTv.in - Telugu News
mictv telugu

బీఫ్ తినండి కానీ ఫెస్టివల్స్ అవసరమా ?

February 19, 2018

కిస్ పెట్టాలనిపిస్తే పెట్టేయండి.. దానికోసం ఫెస్టివల్స్ పెట్టడం అవసరమా ? ’ అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.  ముంబైలోని ఆర్ఎ పొద్దార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్‌లో ఆయన పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. అలాగే ‘ మీకు బీఫ్ తినాలనిపించినా తినండి.. కానీ బీఫ్ ఫెస్టివల్స్ వంటివి చెయ్యకండి. తినేటప్పుడు ఇతరుల పర్మిషన్ అవసరం లేదుకదా ? ’ అని ప్రశ్నించారు. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్ గురు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ‘ అఫ్జల్ గురు దేశభక్తుడేం కాదు.. అతని జపం చేయటానికి. అతను పార్లమెంట్‌ను పేల్చేసే కుట్ర చేశాడు. అలాంటి ఉగ్రవాది జపం చేయటం ఎంత వరకు కరెక్టో ఆలోచించండి ’ అంటూ హితవు పలికారు.