ఈమె కాళ్ల పొడవెంతో తెలుసా?  - MicTv.in - Telugu News
mictv telugu

ఈమె కాళ్ల పొడవెంతో తెలుసా? 

September 9, 2017

పొడుగు కాళ్ల అమ్మాయి అని అనగానే  అందరికీ గుర్తుకొచ్చేది మన బాలీవుడ్ అందాల భామ శిల్పాశెట్టి. కాని రష్యాకు చెందిన మోడల్ ఎకటెరినా లిసినా కాళ్లను చూస్తే శిల్ప కూడా కుళ్లుకుంటుంది. లిసినా  ప్రపంచంలోనే అత్యంత పొడుగు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డు సాధించింది.  ఆమె పొడుగు 6.9 అడుగులు.  కాళ్ల పొడవు 52.4 అంగుళాలు. జూన్ 13న ఆమె కాళ్ల కొలతలను గిన్నిస్  బుక్ అధికారులు తీసుకున్నారు. ప్రపంచంలోనే అంత్యత పొడుగు కాళ్ల మహిళగా ఆమె 2018 ఏడాదికి  గిన్నిస్ రికార్డు సాధించింది. గిన్నిస్ బుక్ అధికారులు ఆమెకు ద్రువపత్రం అందచేశారు. 2018 ఎడిషన్ లో కూడా ఆమె వివరాలను పొందుపరచారు.

ఆమె తండ్రి విక్టర్ లిసిన్ మాట్లాడుతూ.. ‘నా కూతురు పుట్టినప్పుడే తన కాళ్లు చాలా పొడవుగా  ఉన్నాయి. ఇప్పుడు ఆ కాళ్లే  ఆమెకు  ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.. ’ అని ఆనందం వ్యక్తం చేశాడు.  29ఏళ్ల ఎకరిటెనా లిసినా మోడల్ గానే కాక బాస్కెట్ బాల్ క్రిీడాకారిణిగానూ  రాణిస్తోంది. 2008 ఒలంపిక్స్ లో బాస్కెట్ బాల్ ఆటలో కాంస్య పతకాన్ని సాధించిన  రష్యా టీంలో సభ్యురాలు ఆమె. రష్యా బాస్కెట్ బాల్ ప్రీమీయర్ లీక్ కు ప్రాతినిధ్యం వహిస్తోంది. మోడల్ రంగంలో రాణించాలంటే పొడుగు కాళ్లు చాలా అవసరం అని తెలిపింది. ‘నాకు పొడగు కాళ్లతోనే మోడల్ రంగంలో చాలా అవకాశాలు, గుర్తింపు వచ్చాయి’ అని మురిసిపోతూ చెప్పింది.